Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు కలిశారు. పరస్పరం కరచాలనం చేసుకుంటూ అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. అలాగే మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆశిర్వాద్ పైప్స్ సంస్థ రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అలియాక్సిస్ కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫార్మా కంపెనీ సీఈవో వసంత్నరసింహన్ మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నోవార్టిస్ కంపెనీ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టింది. అనంతరం వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో ''ఆన్ ది స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్'' అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ల విస్తత ఉపయోగాలపై చర్చించారు. ఈ సదస్సులోనే మంత్రి సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో ముచ్చటించారు. ఆయన చేపట్టిన 'సేవ్ సాయిల్' కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.