Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులకు పేరుగాంచిన లౌరిక్ బైట్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నిద్రను పెంచడంతో పాటు, ఆరోగ్య సంరక్షణకు లౌరిక్ బైట్స్ ఉపయోగపడతాయని పేర్కొన్నది. తల్లిపాలలో లభించే లౌరిక్ యాసిడ్ వంటి అరుదైన, పూలు, కొబ్బరి వంటి సహజమైన 26 పదార్థాలతో బైట్స్ను ఉత్పత్తి చేసినట్టు వెల్లడించింది. తమ సంస్థ ఒక నెలలో 150 శాతం వృద్ధిని, వంద శాతం కొత్త సందర్శకులను సంపాదించుకుందని తెలిపారు. ఈ సందర్భంగా లౌరిక్ వ్యవస్థాపక సీఈవో లావణ్య సుంకరి మాట్లాడుతూ... ఎవరైతే ఆందోళన, నిద్రలేమితో బాధపడుతున్నారో అలాంటి వారికి లౌరిక్ బైట్స్ విముక్తిని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ నూతన ఆవిష్కరణలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు.