Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలస కార్మికుడు మృతి
- మరో ఇద్దరికి గాయాలు
నవతెలంగాణ - కోనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్ధనపేట గ్రామ శివారులో కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ-9 సొరంగంలో చేపట్టిన పనుల్లో మంగళ వారం జరిగిన ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
మల్కపేట ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా మర్ధనపేట గ్రామ శివారులో గల అండర్ టన్నెల్‌లోని ఆడిట్-2లో 12వ కిలో మీటర్ వద్ద ఎనిమిది మంది కార్మికులు పనికి వెళ్లారు. పనిచేస్తున్న క్రమంలో పెద్దరాయి కూలడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యోగేంద్రకుమార్ మేహ(24) మార్గమధ్యలో మృతిచెందాడు. కార్మికులు ఉమేష్‌కుమార్ మహంత్, ఆవెల్ టోప్నో తీవ్రంగా గాయపడ్డారు. వారిని కరీంనగర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సొరంగంలో ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరి గిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. స్థానిక ఎస్ఐ ప్రేమ్‌దీప్ సంఘ టనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.