Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకులకు చెందిన ఓ రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గన్ముకుల గ్రామానికి చెందిన జునుమాల కొమురయ్య(45) తన మూడెకరాల్లో వరి, పత్తి పండించాడు. మూడేండ్లుగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో దాదాపు రూ.9లక్షల మేర అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలని తరుచూ మదనపడే కొమురయ్య మంగళవారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.