Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కె. పి. వివేకానంద
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల కోసమంటూ చెబుతున్న వరంగల్ డిక్లరేషన్‌ను ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద సవాల్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న సైనికులు, రైతులను ఆదుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆదుకుందని గుర్తుచేశారు. రచ్చబండ పేరుతో విరుచుకుపడుతున్న టీపీసీెసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుగా డిక్లరేషన్‌పై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డికి ఉన్న అనుమానాలను తొలగించాలని సూచించారు.
రేవంత్ దందాలు మాకు తెలుసు.....
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని రేవంత్ సంపాదిస్తున్నారని విమర్శించారు. రేవంత్ చేస్తున్న దందాలు మాకు తెలుసని చెప్పారు.
బ్లాక్ మెయిల్‌తో సంపాదించాడు...
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్‌తో సంపాదించారని రాష్ట్ర మంత్రి సి.మల్లారెడ్డి విమర్శించారు. తనను కూడా గతంలో బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. రేవంత్ కూతురు పెండ్లికి డబ్బిచ్చానని చెప్పారు. రేవంత్ ఆస్తులెలా సంపాదించాడని ఆయన ప్రశ్నించారు.
మెజార్టీ కులాలను కాదని ....
మెజార్టీ ఉన్న కులాలను కాదని తన వర్గానికి సీఎం పదవి కావాలని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. .. రేవంత్ మాటలు కాంగ్రెస్ పార్టీకే సిగ్గు చేటన్నారు. .కాంగ్రెస్‌లో ఉన్న మిగతా వర్గాల నేతలు ఎందుకు పెదవులు విప్పడం లేదని ప్రశ్నించారు.