Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగంపేట్
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి పది రోజులు అవుతున్నా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి రైతులు మంగళవారం ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. తేమ శాతం వచ్చి తూకం ధాన్యం తరలిద్దామంటే లారీలు లేకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించడం ఒకెత్తయితే.. అమ్ముకోడానికి అరిగోస పడాల్సి వస్తోందన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. కామారెడ్డి నుంచి వస్తున్న రెండు లారీలను కొనుగోలు కేంద్రానికి తరలించడంతో వారు ఆందోళన విరమించారు.