Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌కు మోడీ... బెంగుళూరుకు కేసీఆర్
- నేడు ఐఎస్బీ ద్విదశాబ్ధి వార్షికోత్సవానికి ప్రధాని
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని హాజరు
- మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీకి సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మాత్రం గురువారం బెంగుళూరుకు వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తుంటే ముఖ్యమంత్రి లేకపోవడం గమనార్హం. భారత్ బయోటెక్ సందర్శించినపుడు, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ముఖ్యఅతిధిగా ప్రధాని మోడీ వచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. గురువారం ఐఎస్బీ దిదశాబ్ధి వార్షికోత్సవానికి ప్రధాని వస్తుంటే ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలు అందరిలోనూ ఆసక్తికరంగా మారాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ధి వార్షికోత్సవానికి ముఖ్యఅతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మొదటిసారి ఐఎస్బీ హైదరాబాద్‌కు చెందిన 600 మంది, మొహాలికి చెందిన 330 మంది కలిపి మొత్తం 930 మంది విద్యార్థులతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఎనిమిది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.
భారీ భద్రత
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్బీ విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రోన్ కెమెరాలకు అనుమతిని నిరాకరించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్నందున హైదరాబాద్ సీపీ సివి ఆనంద్‌కు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఇన్‌ఛార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
నగరంలో ప్రధాని పర్యటన వివరాలు
8మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
8మధ్యాహ్నం 1.45 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో బీజేపీ నేతలతో సమావేశమవుతారు.
8మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కి చేరుకుంటారు. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన రెండు కిలోమీటర్లు ఐఎస్బీకి ప్రయాణం చేస్తారు.
8మధ్యాహ్నం రెండు గంటలకు ఐఎస్బీకి చేరుకుంటారు. మొక్క నాటుతారు.
8ఐఎస్బీ చరిత్రను డీన్ మదన్ పిల్లుట్ల వివరిస్తారు.
8మధ్యాహ్నం 2.31 నుంచి 2.35 గంటల వరకు విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తారు.
8మధ్యాహ్నం 2.35 నుంచి 3.10 గంటల వరకు ప్రధాని ప్రసంగం ఉంటుంది.
8మధ్యాహ్నం 3.10 గంటలకు ఐఎస్బీ నుంచి బయల్దేరి వెళ్తారు.
8మధ్యాహ్న 3.25 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరకుంటారు.
8మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 3.50 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు.
8మధ్యాహ్నం 3.55 గంటలకు బేగంపేట నుంచి చెన్నైకి బయల్దేరి వెళ్తారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు
గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. ఈనెల 27న బెంగుళూరు నుంచి రాలేగావ్ సిద్ధి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం కేసీఆర్ షిర్డీ వెళ్తారు. అక్కడి నుంచి పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఈనెల 29,30 తేదీల్లో పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా వారి కుటుంబాలను సీఎం ఆదుకుంటారు.