Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న వెదర్బులిటెన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని సూచించారు. ఉత్తర ఇంటీరియల్ కర్నాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. రాబోయే 48 గంటల్లో నైరుతి, ఆగేయా అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ, తూర్పు బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు.