Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్.కృష్ణయ్య నామినేషన్‌కు అమరావతి తరలివెళ్లిన బీసీ నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ తెలిపారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి బీసీ నేతలు పెద్ద ఎత్తున అమరావతికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ.. ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ అవకాశాన్ని కల్పించిన ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిల్లు, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, బీసీల కులగణనను చట్టపరంగా సాధించుకునే వరకూ పార్లమెంటు లోపలా, వెలుపలా పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సీనియర్ నాయకులు బుల్లెట్ సురేష్, నీలం వెంకటేష్, లాల్ కృష్ణ, గుజ్జ సత్యం, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజరు కుమార్, నాయకులు ఊరుగొండ శివ, ఎన్. వెంకట్, ఉదరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.