Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలతోనే రైతులు కష్టాలు పడుతున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ముందు పెడుతూ...కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు అవుతుందా? వడ్లల్లో 33 శాతం తేమ ఉన్నా కూడా రూ.1960 మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమను నిర్దారించే మిషన్లు ఉన్నాయని చెప్పారు. అవి సరిగా పని చేయడం లేదన్నారు. తేమ మిషనన్లలో 12 రోజులుగా ఎండిన వడ్లు పోస్తే 23 శాతం చూపించిందన్నారు. ఎండలో ఉన్న ఇసుక కూడా 18.7 తేమ వచ్చిందన్నారు. దీనిపై సీఎం సమీక్ష నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.