Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జక్రాన్పల్లి
రహస్య కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన గుద్దేటి అశోక్, సిరికొండ మండలం మైపాల్ తండాకు చెందిన గూగులొతు రాజు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో గుద్దేటి అశోక్ వ్యవసాయ క్షేత్రం వద్ద ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.