Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి చుట్టపుచూపుగా వచ్చి ఉపన్యాసాలకు పరిమితమై పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని రాష్ట్ర పర్యటనతో ప్రజలకు పైసా ప్రయోజనం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.హెచ్ఎంటీ ఆస్తులను,సంస్థలను కాపాడాలని కేంద్రా న్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కేంద్రం లాక్కోవడం సరికాదని తెలిపారు.కార్మికుల పక్షాన టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర పరిధిలో ఉద్యోగ నియామకాలపై మోడీ పెదవి విప్పాలని కోరారు.
కిషన్ రెడ్డి పోరాడాలి
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పోరాడాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్రెడ్డి ప్రజలకే కాదు బీజేపీ కార్యకర్తలకు చేసింది కూడా ఏమి లేదన్నారు.