Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిపాలనా అనుమతులు మంజూరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రూ.35 కోట్లను ఆస్పత్రి నిర్మాణానికి, రూ.9.84 కోట్లను నిర్వహణ ఖర్చుగా వెచ్చించనున్నారు. పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా ఉన్నతీకరిస్తున్న నేపథ్యంలో దాన్ని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధి నుంచి తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేశారు.
ధన్యవాదాలు....మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భీంగల్‌కు వంద పడకల ఆస్పత్రికి మంజూరు చేయించిన సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఇక మీదట ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. బాల్కొండ ప్రజలపై సీఎం చూపే ప్రేమకు ఆస్పత్రి నిదర్శనమని వివరించారు.