Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ రాష్ట నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి..
నవ తెలంగాణ వెల్దండ.
మండల పరిధిలోని కొట్రర గ్రామంలో గ్రామ సేవ సమితి అధ్యక్షుడు పోనుగోటి రవీందర్ రావ్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి జయంతి నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ రాష్ట నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ ,సింగల్ విండో వైస్ చైర్మె న్ సంజీవ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవీందర్ రావ్ స్వామి వారికి మకర తోరణాన్ని బహూకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం గ్రామంలో బైకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీవో వేంకటేశ్వర రావు, ఏంపివో లాలయ్య, కార్యదర్శి బాలస్వామి, గ్రామస్థులు నాగరాజు, మల్లేష్, మల్లేష్, విష్ణు, రవి, హరిప్రసాద్ ,వెంకటయ్య, నరసింహ, జంగయ్య, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.