Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
యునెటైడ్ కింగ్డమ్ నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తలతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని సందర్శించింది. నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం, గీతం మధ్య భవిష్యత్లో విద్యాపరమైన సహకారంపై ఆ ప్రతినిధి బృందం చర్చించినట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు వెల్లడించారు. బ్రిటన్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే అభిలాష ఉన్న విద్యార్థులతో వారు ముఖాముఖి చర్చించడంతో పాటు ఆ విశ్వవిద్యాలయం అందజేస్తున్న ప్రోత్సాహక స్కాలర్షిప్ల గురించి వివరించినట్టు తెలిపారు.
ఈ ప్రతినిధి బృందంలో జార్జ్ గ్రీన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రోమాగెటిక్స్ రీసెర్చ్ సభ్యుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ గ్రీడ్, బయోటెక్నాలజీ ప్రోగ్రామ్స్ డెరైక్టర్ డాక్టర్ నాగమణి బోరా, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ (అడ్మిషన్స్) లూసీ రోజ్, ఇంటర్నేషనల్ పార్టనర్షిఫ్ మేనేజర్ మ్యాట్ బోన్నర్లు ఉన్నారని వివరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెల్ డెరైక్టర్ డాక్టర్ వేణుకుమార్ నాతి నేతృత్వంలోని గీతం అధ్యాపకుల బృందం వారితో చర్చించినట్టు తెలిపారు.