Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.80 వేల నగదుతో పట్టుబడ్డ ఎఫ్ఆర్వో, సెక్షన్ ఆఫీసర్
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్
వ్యాపార లైసెన్స్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారి వద్ద నుంచి అటవీ అధికారులు లంచం డిమాండ్ చేయ డంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా అటవీశాఖ అధికారులను పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బుధ వారం జరిగింది. రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్‌లోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యాపారి మండలంలోని కొత్వాల్ గూడ సమీపంలో సామిల్ (టింబర్ డిపో) ఏర్పాటు చేయడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ ఇవ్వడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ పీర్యా నాయక్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో గత్యంతరం లేక ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అప్రమత్తమైన అధికారులు ఎఫ్ఆర్ఓ సెక్షన్ ఆఫీసర్లకు గగన్‌పహాడ్‌లోని అటవీశాఖ కార్యాలయంలో రూ.80వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికా రులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఇద్దరు అధికా రులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరచి రిమాం డ్కు తరలిస్తామని తెలిపారు. పట్టుబడిన అధికారులు నివాసం ఉంటున్న వారాసిగూడ, ఎఫ్ఆర్ఓ నివాసం ఉంటున్న షాద్‌నగర్ ఇండ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.