Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ రోడ్లపై స్పీడ్ లిమిట్ ప్రకటించిన ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
లక్షలు పోసి బైక్లు, కార్లు కొని రోడ్లపై ఇష్టం వచ్చినట్టు రయ్యిన దూసుకుపోతామంటే ఇకపై కుదరదు. ఎంత ఖర్చు పెట్టి బండ్లు కొన్నా...ప్రభుత్వం నిర్ణయించిన వేగంతోనే రోడ్లపై డ్రైవింగ్ చేయాలి. కాదూ...కూడదు అంటే 'స్పీడ్ గన్' పెనాల్టీలకు సిద్ధపడాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ రోడ్డుపై ఏఏ వాహనాలు ఎంత వేగంగా వెళ్లాలో నిర్ణయిస్తూ రవాణాశాఖ జీవో ఎమ్మెస్ 27 జారీ చేసింది. రోడ్డు డివైడర్లు ఉన్న చోట కార్లు గంటకు 60 కిలోమీటర్లు, ఇతర వాహనాలు 50 కి.మీ., వేగంతో వెళ్లాలి. డివైడర్లు లేని చోట పై వరుసలోనే 50-40 స్పీడ్తో వెళ్లాలి. కాలనీ రోడ్లలో అయితే కారు, బైక్, బస్సులు, ఆటోలు, ఇతర గూడ్స్ వాహనాలైతే 30 కి.మీ., వేగంతో మాత్రమే వెళ్లాలి. రోడ్డు ప్రమాదాల నివారణకోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రవాణాశాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్పీడ్ లిమిట్ తక్షణం అమల్లోకి వస్తుంది.