Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మూర్లో నకిలీ నోట్ల కలకలం
- చితికిపోతున్న చిరువ్యాపారులు
నవతెలంగాణ-ఆర్మూర్
నకిలీ నోట్లను అరి కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశ పెట్టినప్పటికీ, నకిలీ నోట్లు చలామణికి అడ్డుకట్ట వేయలేకపో తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చలామణి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. కేటుగాళ్లు చిరు వ్యాపారస్తు లను టార్గెట్ చేస్తూ నకిలీ నోట్లను చలామణి చేస్తు న్నారు. ఆ నోటు ఈ నోటు అనకుండా ఏ నోటైనా అచ్చువేసి సంతలో రద్దీ ప్రదేశాల్లో చలామణి చేస్తున్నారు. కేటుగాళ్లు.. అమాయక ప్రజలు, చిరు వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ వంద రూపా యల అసలు నోటుకు నకిలీ 500 రూపాయలు చెల్లి స్తున్నట్టు సమా చారం. కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నకిలీ నోట్లను మార్కెట్లోకి చలా మణి చేస్తున్నట్టు సమా చారం.
ఆర్మూర్ డివిజన్లో నంది పేట్, ఆర్మూర్ సంతలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. నకిలీ నోట్ల కేటుగాళ్లు ఈ సంతలను టార్గెట్ చేస్తూ అసలు నోట్లతో నకిలీ నోట్లను కలిపి అనుమానం రాకుండా చలామణి చేస్తున్నారు. నకిలీ నోట్ల బారినపడి బాధితులు ఆర్థికంగా నష్టపోయినా బయటకు చెప్పలేకపోయిన సంఘటనలూ లేకపోలేదు. రెండు రోజుల క్రితం పెర్కిట్ గ్రామంలోని సంతలో నకిలీ రెండు వందలనోట్లు చలామణి సాగినట్టు తెలుస్తోంది. అసలు నోటుతో కలిపి నకిలీ నోట్లను జత చేసి చలామణిలోకి తెస్తున్నారు. దాంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్ సంతలో నకిలీ నోట్లు బయటపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా పట్టణంలోని పెర్కిట్లో నిత్యం జరుగు సంతలో మంగళవారం వంద, రెండు వందల రూపాయల నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. నకిలీ నోట్ల చెలామణి విషయమై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు, వ్యాపారస్తులు అంటున్నారు. ఈ విషయమై జిల్లా సీపీ నాగరాజు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నకిలీ నోటు
ఇచ్చి పోయిండు
ఎవరో ఒకాయన నకిలీ నోటు ఇచ్చి పోయిండు. పొద్దస్తమానం ఎండలో ఉండి కూరగాయలు అమ్ముకుంటం. పొద్దంతా వ్యాపారం చేస్తే రెండు, మూడు వందలు వస్తాయి. ఈ నకిలీ నోట్లతో మా కష్టం అంతా బూడిద పాలైతుంది. నకిలీ నోట్ల చలామణితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వీటిని ఎలాగైనా అరికట్టండి సారూ.
- చిరు వ్యాపారి