Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,400 కోట్ల పెట్టుబడి 'దావోస్'లో ఒప్పందం
- అభినందించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హ్యూందారు గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో హ్యుందారు సీఐఓ యాంగ్ చోచీ భేటీ అయ్యారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్ తాము ఈ పెట్టుబడి పెట్టి భాగస్వామిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుందారు పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పారిశ్రామిక, ఆర్థిక సంస్థలు మొబిలిటీ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జీఎంఎం ఫాడులర్ సంస్థ హైదరాబాద్‌లో గ్లాస్-లైన్ పరికరాల తయారీ కోసం విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. దీనికోసం 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపింది. ఈ సంస్థ ఫార్మా కంపెనీల కు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేస్తుంది. దీనిపై విషయాన్ని దావోస్ +వీవీ ూటaబసశ్రీవతీ (జిఎంఎం ఫాడులర్ ) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. జీఎంఎం ఫాడులర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సిఈవో థామస్ కెV్‌ా్ల, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ డైరెక్టర్- అశోక్ జే పటేల్ లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండేండ్ల క్రితం 6.3 మిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో ఈ సంస్థ తమ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలనుకున్న కంపెనీ అదనంగా మరో 37 లక్షల డాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వీడన్‌కు చెందిన ఎమ్పీ (ఈఎమ్పిఈ) డయాగ్నోస్టిక్స్ సంస్థ హైదరాబాద్‌లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనికోసం జీనోమ్ వ్యాలీలో 25 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకల సీఈఓ డాక్టర్ పవన్ అసలాపురం మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్ దావోస్‌లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.