Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగాన్ని బట్టి రివార్డు పాయింట్లు కూడా...
- కొత్తగా 928 ఐ-టిమ్స్ కొనుగోలు
- ప్రయాణానికి సాంకేతికత అనుసంధానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ ఆర్టీసీలో త్వరలో స్మార్ట్ కార్డుల్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయనీ, వినియోగాన్ని బట్టి రివార్డు పాయింట్లు కూడా ఉంటాయని చెప్పారు. ప్రయాణానికి సాంకేతికతను అనుసంధానిస్తూ, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని గురువారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. దానిలో భాగంగానే త్వరలో 928 ఇంటిగ్రేటెడ్ టిక్కెట్ ఇష్యూ మెషిన్స్ (ఐ-టిమ్స్)ను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. దూర ప్రాంత బస్సుల్లో ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రతి బస్ స్టేషన్ నుంచి బస్సు బయలుదేరే సమయానికి 15 నిముషాల ముందు ప్రయాణీకులు టిక్కెట్లను బుక్ చేసుకునే సౌలభ్యం ఐ-టిమ్స్‌లో ఉంటుందని వివరించారు. ప్రస్తుతం దూర ప్రాంత సర్వీసుల్లో ఆన్లైన్ బుకింగ్, రిజర్వేషన్ ఒక గంట ముందు నిలిపివేస్తున్నామనీ, దాన్ని 15 నిముషాలకు కుదించి బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి... ఎంత సమయంలో బస్సు చేరుతుందనే విషయాలు ముందుగానే తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రయాణీకులు టిక్కెట్లను పొందేందుకు బస్సుల్లో నగదు చెల్లించాల్సి వస్తుందనీ, ఐ-టిమ్స్ వినియోగం వల్ల ప్రయాణీకులు బస్సులో యు.పి.ఐ లేదా క్రెడిట్ / డెబిట్ కార్డు చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు.