Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో వరంగల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర-సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర, సాంకేతిక మండలి సాధించిన విజయాలు, ప్రగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు వీలుగా టీఎస్కాస్ట్ మంచి పనితీరును కనబరుస్తుందని చెప్పారు. రూ. 14.51 కోట్లతో వినూత్నంగా ఏడు ప్రాజెక్టులను అమలు చేస్తున్నదనీ, వాటిలో వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్ (ఆర్ఎస్సీలో ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్మెంట్, వరంగల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఏర్పాటు, నేషనల్ సైన్స్ డే, నేషనల్ మ్యాథమ్యాటిక్స్ డే వేడుకలు, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రూ. 42.41 కోట్లతో నిర్మల్లో సైన్స్ సెంటర్, ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. సైన్స్ సెంటర్కు ఐదెకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించినట్టు వెల్లడించారు.