Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీఐఆర్‌కు అనుమతి, 'పాలమూరు రంగారెడ్డి'కి జాతీయ హోదా ఏదీ?
- మంత్రి సబితా ఇంద్రారెడ్డిరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించడంతో ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు అనుమతి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారంటూ అందరూ ఆశించారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అవి ఇవ్వకపోగా ప్రధాని హోదాకు తగినట్టు మోడీ మాట్లాడలేదని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి రాజకీయాలు మాట్లాడ్డం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ప్రకటన చేస్తే తెలంగాణ సమాజం హర్షించేదని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనేది నినాదానికే పరిమితం చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని తెలిపారు. పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఉన్నత విద్యను దూరం చేసిన మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతతో ముందుకెళ్తామనీ, అంధ విశ్వాసాలను నమ్మబోమంటూ చెప్పిన ప్రధాని కరోనా సమయంలో చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ఏ సాంకేతికత కింద వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారం టూ చెప్పిన మోడీ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఆ తర్వాతే ప్రజల పట్టుదల, పౌరుషం గురించి మాట్లాడాలని తెలిపారు. విభజన హామీలు మరిచిపోయారని విమర్శించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం చిల్లిగవ్వ సహాయం చేయకుండా అభివృద్ధి గురించి మాట్లాడ్డం హాస్యాస్పందంగా ఉందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల లో తెలంగాణకు ఏం చేశారో, ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని కోరారు. రాష్ట్రంపై అన్ని విషయాల్లోనూ వివక్ష చూపుతూ, విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వందశాతం పనిచేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎవరైనా రావొచ్చు, పోవచ్చనీ, కానీ పర్యాటకుల మాదిరి కాకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు విధానాలతో వచ్చి అభివృద్ధికి సహకారం అందిస్తే బాగుండేదని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.
ప్రధాని మోడీవి అవగాహనా రాహిత్య మాటలు :మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రధాని మోడీ చరిత్ర తెలియకుండా అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అన్నారు. అద్వానీ, జోషి లాంటి వాళ్ళని తొక్కి పైకి వచ్చిన మోడీ తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.మోడీకి కుటుంబ ం లేదని,అందువల్ల ఆయనకు సెంటిమెంట్లు తెలియవన్నారు.సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన కాదనీ, ఆయన కుటుంబమంతా తెలంగాణ కోసం ఉద్యమించి జైళ్ళకు పోయి త్యాగాలు చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించడమంటే రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే నన్నారు. పార్లమెంట్లో తెలంగాణను అవమానపరి చారు..తెలంగాణ ప్రజలు నూకలు తిని బతకాలని కించపరిచారు...ఇవ్వాల వచ్చి కపట ప్రేమ చూపిస్తే ఎవ్వరూ నమ్మరని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందనే దానిపై స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు. అడుగడుగునా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.మోడీ కుటుంబంగా అంబానీ, ఆదానీలు ఉన్న మాట వాస్తవం కాదా? రాష్ట్రాలను ఆదాయాల కు గండి కొట్టి వారికి దోచిపెడుతున్నది నిజం కాదా? అని నిలదీశారు. అంబానీ, అదానీల బీజేపీని తరిమి కొడితేనే దేశానికి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరకుంటున్నామని చెప్పారు. నిరంకుశంగా పాలిస్తున్నది కేంద్రమే అని విమర్శించా రు. కులం, మతం, ప్రాంతం, దేవుళ్లు, వ్యక్తులను అడ్డం పెట్టుకుని విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు.