Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు
- అధికారులకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా అనంతరం, వినతులు అందించారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాచలంలోని అమరవీరుల స్థూపాల దగ్గర ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. వినతిపత్రాలు అందజేశారు.పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు ఆందోళనబాట పట్టాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టని పాలకులకు పాలించే నైతిక హక్కులేదని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలను నియంత్రిం చాలని డిమాండ్ చేశారు.ధరల పెరుగుదలను నిరసి స్తూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో వామపక్షాల ఆధ్వ ర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ మండలం లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు నిరసన తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్‌లో సీపీఐ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్శింగ్రావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధిక ధరలను అదుపు చేయలేని కేంద్ర, రాష్ట్ర అసమర్ధ ప్రభుత్వాలకు ప్రజలను పాలించే హక్కు లేదని వామపక్ష నాయకులు విమర్శించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ధర్నాలు చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచటంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించకపోవడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం మరింత పెరుగుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగి శత కోటీశ్వరులు మారుతున్నారని వీటి మూలంగా తారతమ్యాలు పెరుగుతున్నాయని వివరించారు.