Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల పరీక్షలు జులై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్), ఎంఏ, ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ), ఎంబీఏ, మాస్టర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎంఎల్ఐఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎల్ఐఎస్సీ), అన్ని డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు షషష.bతీaశీబశీఅశ్రీఱఅవ.ఱఅ పోర్టల్‌ను సందర్శించి పరీక్షల రిజిస్ట్రేషన్‌ను ఓపెన్ చేసి విద్యార్థులు రుసుమును టీఎస్/ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతో మాత్రమే చెల్లించాలని సూచించారు. పరీక్షలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కోరారు. అన్ని కోర్సుల పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివర తేదీ వచ్చేనెల 14 వరకుందని తెలిపారు.