నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి జయంతి (మే 28) సందర్భంగా ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ పై వివక్షను ఆనాడేే ఎదిరించి సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి వుందని సీఎం తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.