Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
విద్యుదాఘాతంతో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం... లద్నూర్ గ్రామానికి చెందిన తాడూరి శ్రీనివాస్‌గౌడ్ తన వ్యవసాయ బావి వద్ద పొలంలో ఉన్న గడ్డిని ట్రాక్టర్‌లో వేసుకొని వస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్‌లోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. దాంతో గడ్డితో పాటు ట్రాక్టరూ పూర్తిగా దగ్ధమైంది. తనకు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని తాడూరి శ్రీనివాస్ గౌడ్ బోరున విలపించారు. అధికారులు తనకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు.