Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు పీడీఎస్యూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సులకు ఫీజుల పెంపునకు సంబంధించి ఏఐసీటీఈ ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేయొద్దని పీడీఎస్యూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము, సహాయ కార్యదర్శి ఎస్ అనిల్ కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలను రాష్ట్రాలు యధావిధిగా అమలు చేయాలంటూ ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ కమిటీ ఇంజినీరింగ్లో ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే రెట్టింపు చేయాలంటూ ప్రతిపాదనలు రూపొందించిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఫీజులను భరించలేక చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలిపారు. ఈ ఫీజుల పెంపుతో మరింత మంది చదువులకు దూరమయ్యే ప్రమాదముందని వివరించారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపును, ఏఐసీటీఈ ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేయొద్దని కోరారు.