Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారనీ, అందుకే మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాటలను జనం పట్టించుకోవడంలేదని చెప్పారు. హుజురాబాద్‌లో వేల కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ ఓటమిపాలైందని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని జీపీఏ చేశారా?అని నిలదీశారు. ప్రధాని మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. దేశ రాజకీయాల కన్నా ముందు కేసీఆర్ వైఖరిలో గుణాత్మక మార్పు రావాలని సూచించారు. సిద్ధాంతపరంగా తాము కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కుటుంబపాలనతో దేశం భ్రష్టుపట్టి పోతోందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండానే రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా ముందుకెళ్తున్నదని ప్రశ్నించారు.