Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్‌కు లేఖ రాశారు. కొన్ని కారణాల మూలంగా పార్టీలో పనిచేయలేకపోతున్నానని పేర్కొన్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నాయకుల ఒంటెద్దు పోకడలపై తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీలో కొనసాగడం కష్టమనీ, అందుకే పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.