- పరువు హత్యలు- పరిహసించబడుతున్న రాజ్యాంగ విలువలపై రేపు సమాలోచన సభ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 'పరువు హత్యలు-పరిహసిం చబడుతున్న రాజ్యాంగ విలువలు' అనే అంశంపై సమాలోచన సభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి కొండి మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్య వక్తలుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్, ప్రముఖ నవలా రచయిత్రి లక్ష్మీనాగేశ్వర్, తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, కుల నిర్మూలన సంఘం ఉపాధ్యక్షులు జ్యోతి వాహెద్, ప్రముఖ సాహిత్య పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, సిటీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు పాల్గొంటారు. సభాధ్యక్షులుగా గాజోజు నాగభూషణం వ్యవహరించనున్నారు.