- గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి - మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ చరిత్ర పరిశోధనలో, సాహిత్య రచనలో, కవితా సంకలనాల్లో, సామాజిక వేత్తగా, పత్రికా అధినేతగా బహుముఖీనమైన పాత్ర పోషించిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ జాతి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన తేజోమూర్తి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సురవరం 126వ జయంతి ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని సాంస్కృ తిక శాఖ సంచాలకుడిని ఆదేశించా రు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం విగ్రహానికి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ప్రజాప్రతిని ధులతో కలసి నివాళులర్పించి ...జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో అత్యంత వైభవంగా సురవ రం ప్రతాపరెడ్డి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయా లని అధికారులను ఆదేశించారు.