- వాషింగ్టన్ మీట్ అండ్ గ్రీట్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ భారతదేశానికే అభివృద్ధి నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం వాషింగ్టన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌కు దీటుగా తెలంగాణలో వస్తున్నదని వివరించారు. మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని చెప్పారు. వ్యవసాయం, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని అన్నారు. వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. వర్జీనియా రాష్ట్రంలోని ఆల్డి నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్, కాల్వల విషు, పాదురు శ్రవణ్, అమరేందర్ బొజ్జ, సుధా కొండరాపు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.