Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు కేశం నాగరాజు గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
హైదరాబాద్: తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్గా శంబుల శ్రీకాంత్ గౌడ్ నియమితు లయ్యారు.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం నాగరాజు గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గౌడ సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టపర్చేందుకు శ్రీకాంత్ గౌడ్ కృషి చేస్తారనే అపార నమ్మకంతో ఆయనకు కీలక బాధ్య తలను అప్పగించినట్టు తెలిపారు. కేశం నాగరాజు గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించిన అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లా డారు. గౌడ సంఘం బలోపేతానికి తన వంతుగా కృషి చేయనున్నట్టు తెలిపారు. గౌడ సంఘం యొక్క ఆశయాలు, ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేస్తానని చెప్పారు. గౌడ సంఘం సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీకాంత్ గౌడ్ భరోసా ఇచ్చారు.