Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆషా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యారోగ్య కమిషనర్‌కు తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, కె.సునిత వినతిప త్రాన్ని హైదరాబాద్‌లో శుక్రవారం అందజేశారు. ఆషాలకు 9,750 వేతనం అందరికీ చెల్లించాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల పీఆర్సీ ఏరియల్స్, 16 నెలల కరోనా రిస్క్ అలవెన్స్ బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. 32 రకాల రిజిష్టర్లు ప్రింట్ చేసి ప్రభుత్వమే సరఫరా చేయాలని విన్నవించారు. ఆషాలు ఇప్పటిదాకా రిజిష్టర్లపై పెట్టిన ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్స్‌ను ఇవ్వాలనీ, జిల్లా ఆస్పత్రుల్లో విశాంత్రి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆషాలకు ప్రమాద బీమా కల్పించాలని కోరారు.