Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ-కల్చరల్
దీపావళి, సంక్రాంతి పండుగల్లాగే యోగా దినోత్సవాన్ని (జూన్ 21) ఆరోగ్య పండుగలా జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతరులను గౌరవించే సంస్కారంతోపాటు తమ శరీరాన్ని, మనస్సును కూడా గౌరవించుకునేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల ముందు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో నాంది ప్రస్తావన ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు అధికంగా ఉన్న రాష్ట్రంలో వారు ఒత్తిడి నుంచి ఊరట నిచ్చేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుం దన్నారు. వారు దీనిని తమ దైనందిన జీవితంలో దినచర్యగా మల్చుకోవాలని సూచించారు. యోగా దినచర్యలో భాగమైతే వృద్ధాప్యం త్వరగా దరిచేరదని, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని, తానొక వైద్యురాలిగా చెప్తున్నానని అన్నారు. జూన్ 21న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ట్యాంక్ బండ్ వద్ద జూన్ 21న ఉదయం 6 గంటలకు యావత్ ప్రపంచం ఆకట్టుకునేలా యోగా దినోత్సవం జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఓడ రేవులు, జల మార్గాల శాఖ మంత్రి సోనోవాల్, క్రీడాకారులు నైనా జైస్వాల్, మైథిలి రాజ్, ప్రముఖ యోగా గురువులు, నటి లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు.