Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భళా... సర్కారు బడి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

భళా... సర్కారు బడి

Sat 28 May 03:55:20.864052 2022

- కార్పొరేట్‌కు మించి సర్కారు బడుల అభివృద్ధి : సబిత
- కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు మెరుగు
- సరికొత్త హంగులతో పాఠశాలలు కళకళ
- మోడల్‌గా డిజిటల్‌ తరగతి గదుల నిర్మాణం
- అందరూ అబ్బురపడేలా మౌలిక వసతులు
- 'మన ఊరు-మనబడి'తో మారిన రూపురేఖలు
- నాలుగు స్కూళ్లలో పనులు వేగవంతం
- ఆలియా పాఠశాలను సందర్శించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
              ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది కార్పొరేట్‌ పాఠశాల లేదంటే ఇంటర్నేషనల్‌ స్కూల్లోని తరగతి గది అనుకుంటున్నారా?. డిజిటల్‌ హంగులతో తరగతి గది ఉందంటే కచ్చితంగా అది ప్రభుత్వ పాఠశాల మాత్రం కాదు అని అనుకుంటున్నారా? కానీ అది వాస్తవం కాదు. ఇది ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదే. అయినా నమ్మలేకపోతున్నారా?. అవును ఇది నిజం. హైదరాబాద్‌లోని ఆలియా సర్కారు బడిలో మోడల్‌గా తీర్చిదిద్దిన డిజిటల్‌ తరగతుల నిర్మాణం ఇది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుంచి ఇంకో లెక్క అన్నట్టుగా సర్కారు బడులు తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మన ఊరు-మనబడి' కార్యక్రమంతో రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆలియా పాఠశాలలో తరగతి గదులు, మౌలిక వసతులను చూస్తే ఎవరైనా 'భళా సర్కారు బడి'అని అనాల్సిందే. అందరూ అబ్బురపడేలా వసతులు మెరుగుపడుతున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మించి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. దీనికి ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి సర్కారు తీసుకుంటున్న చర్యలు దోహదపడనున్నాయి. 'మన ఊరు-మనబడి' కార్యమ్రంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడాతోపాటు నగరంలోని ఆలియా, మహబూబియా (బాలికల) పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పనులు వేగవంతమవుతున్నాయి. వచ్చేవిద్యాసంవత్సరం (2022-23) నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సర్కారు పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు చర్యల ద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
'మన ఊరు -మనబడి'తో 12 రకాల వసతులు
              ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 'మన ఊరు-మన బడి', పట్టణ ప్రాంతాల్లో 'మన బస్తీ-మన బడి' కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చి ఎనిమిదో తేదీన వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మూడేండ్లలో రూ.7,289.54 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహారీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు, డిజిటల్‌ విద్య అమలు వంటివి అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంతోపాటు ప్రవేశాల సంఖ్య సైతం పెరిగే అవకాశం లేకపోలేదు.
              ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో 'మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి' కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కార్పొరేట్‌కు మించి సర్కారు బడులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి 'మనబస్తీ-మనబడి' కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసిన హైదరాబాద్‌లోని అలియా ప్రభుత్వ మోడల్‌ పాఠశాలను శుక్రవారం సందర్శించి ఆమె పనులు పరిశీలించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ముందుగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యా, వైద్యంపై దృష్టి సారించారని వివరించారు. సర్కారు బడుల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తూ విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే టీచర్లకు శిక్షణ ఇచ్చా మన్నారు. పుస్తకాల ముద్రణ పూర్తయిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భోదన లేనందున విద్యార్థులను తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్లకు పంపుతున్నారని అన్నారు. ఈ నిర్ణయాలతో సర్కారు బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన, ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్‌ శ్రీధర్‌రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీచర్లూ...ఆస్తుల వివరాలివ్వండి!
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
సెల్లార్‌ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన కమిటీ ఏర్పాటు
సర్కార్‌తోట రాయపోల్‌కే చెందాలి
బీసీ విద్యార్థులకు హార్వర్డ్‌ చదువులు
దళితులను, ఆదివాసీలను విస్మరిస్తున్న బ్యాంకులు
కరోనా కేసులు పెరుగుతున్నాయి
సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
కేసీఆర్‌ ప్లేస్‌, డేట్‌ చెప్పండి..చర్చకు సిద్ధం
నోట్లో గుడ్డలు కుక్కి.. మహిళపై లైంగికదాడి
అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి
కోట్ల రూపాయలు నష్టపోతాననే..
ఈ నెల 27,28,29 తేదీల్లో స్వగృహ లాటరీ
సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఏటా విడుదల చేయాలి : బండి
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన చైర్మెన్‌
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల పెంపు
పాలరైతుల పెండింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వండి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీపీటీఎఫ్‌
ఉద్యోగార్ధులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి
కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ సేకరించాలి
పోడు గోడు పట్టదా?
గొర్రెల పంపిణీలో అక్రమాలు
మూడు పంటలు పండే భూములిచ్చాం
నెలవారీ టార్గెట్లు, రాజకీయ వత్తిళ్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.