Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైను ప్రారంభం
- సింగరేణి భాగస్వామ్యంతో పూర్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్ ఉత్పత్తి చేసే బొగ్గును థర్మల్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన రైల్వేలైను పనులు పాక్షికంగా పూర్తయ్యాయి. కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య 54.10 కి.మీ., లైన్ను రూ. 927.94 కోట్ల వ్యయంతో నిర్మించారు. దానిలో సింగరేణి వాటా రూ. 618.55 కోట్లు కాగా దక్షిణ మధ్య రైల్వే వాటా రూ.309.39 కోట్లు. కేవలం రెండున్నరేండ్లలో ఈ లైన్ నిర్మాణ పనులు పూర్తి కావడం విశేషం.