Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సాంకేతిక కారణాలతో వివిధ రూట్లలో తిరిగే 34 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రద్దయిన రూట్లలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతుందని ఆ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ యాదగిరి తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో మరో 9 సర్వీసుల్ని అదనంగా నడుపుతున్నట్టు తెలిపారు. ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 7 సర్వీసులు, లింగంపల్లి- ఫలక్నుమా రూట్లో మరో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒక్క సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో మరో సర్వీసును తిప్పుతున్నట్టు వివరించారు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.