Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణా వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం సురవరం ప్రతాప్ రెడ్డి 126వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతిని అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ, సామాజిక వేత్తలకు పురస్కారాలను అందిస్తున్నామన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వారు జన్మించిన ఇటిక్యాలలో అధికారికంగా సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, సురవరం కష్ణవర్ధన్ రెడ్డి, పుష్పలత, కపిల్, అనిల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్వీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.