Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎమ్పీఎస్) రాష్ట్ర మూడో మహాసభలు సోమ, మంగళవారాల్లో భువనగిరిలో జరగనున్నాయి. ఈ సభల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్... పెంపకందార్లకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మహాసభల వాల్పోస్టర్ను శనివారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. మహాసభలకు అన్ని జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వివరించారు. అనంతరం ఏఆర్ గార్డెన్లో బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. వాల్పోస్టర్ ఆవిష్కరణలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కిల్లె గోపాల్, అధ్యక్షుడు రావుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.