Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 2 నుంచి మూల్యాంకనం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ప్రధాన పరీక్షలు శనివారం ముగిశాయి. ఈనెల 23 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 5,08,143 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వారిలో 5,03,114 (99.01 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 5,021 (0.89 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 87 మంది హాజరయ్యారనీ, 80 మంది పరీక్షకు రాలేదని పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఇక మిగిలిన ఒకేషనల్ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. ఈనెల 30న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కతం, అరబిక్), ఈనెల 31న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కతం, అరబిక్), వచ్చేనెల ఒకటో తేదీన ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో వచ్చేనెల రెండో తేదీ నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చేనెల చివరి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రస్థాయి అధికారుల నియామకం
పదో తరగతి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ వచ్చేనెల రెండు నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి మదన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం 12 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మూల్యాంకనం ప్రక్రియను పరిశీలిచేందుకు రాష్ట్రస్థాయి అధికారులను నియమించామని తెలిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండకు ఎస్ విజయలక్ష్మిబాయి, మెదక్ (సంగారెడ్డి), కరీంనగర్‌కు జి ఉషారాణి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌కు పి రాజీవ్, ఖమ్మం, హనుమకొండకు కె సత్యనారాయణరెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌కు ఈ విజయలక్ష్మిని నియమించామని వివరించారు.