Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత సామరస్యాన్ని చెడగొట్టే వ్యాఖ్యలను ఖండించాలి: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పొరపాటున 'హిందూ గాళ్లు బొందు గాళ్లు' అన్నందుకు.. దాన్ని నినాదంగా చేసుకొని బండి సంజరు గెలిచాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ఏమీ చేయని సంజరు.. కేవలం సెన్సేషన్ కోసమే హిందూ.. ముస్లిం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రామ రాజ్యం అంటే అందరూ సంతోషంగా ఉండేలా చూడాలి కానీ మసీదులు కూల్చేస్తాం అంటూ ప్రజల మధ్య వైశమ్యాలు రెచ్చగొట్టడం కాదన్నారు. ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నారని బండి సంజరు, మోడీ తరచూ చెబుతున్నారే తప్ప ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బండి సంజరు ఓ జోకర్ అయిపోయాడని, ట్రోలిం గ్లో ఆయనే నెంబర్ వన్‌గా ఉన్న డని ఎద్దేవా చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేసి భావోద్వేగాలు, విద్వేషాలు రెచ్చగొట్టిన బండి సంజరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గతంలో జన జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజరును అరెస్టు చేసి హంగామా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మత సామరస్యాన్ని చెడగొట్టే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.