Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరికి తీవ్రగాయాలు
- రథాన్ని లాక్కెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-నాంపల్లి
రథాన్ని లాక్కెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి విద్యుద్ఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాల య్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో శనివారం జరిగింది. సీఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామ సమీపంలోని శ్రీ సీతారాముల దేవాలయం వద్ద ఇటీవల శ్రీరామనవమి సంద ర్భంగా రథోత్సవం జరిగింది. అనంతరం రథాన్ని బయటే వదిలేయడంతో శనివారం గ్రామానికి చెందిన పసునూరి దయానంద్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి తాళ్లతో రథశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు రథానికి తగలడంతో పొగాకు మోహనయ్య (40), రాజబోయిన యాదయ్య(40), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(30) విద్యుద్ఘాతానికి గుర య్యారు. అక్కడికక్కడే మృతిచెందారు. దయా నంద్రెడ్డి, రాజబోయిన వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభు త్వాస్పత్రికి తరలించారు. పొగాకు మోహనయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో కూతురు పదోతరగతి పరీక్ష ముగియగానే తీసుకురావడానికి వెళ్తూ మార్గమధ్యలో రథాన్ని నెడుతూ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. రాజబోయిన యాదయ్యకు కూతురు, ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.