Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మం
విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. శనివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాలు మారుతున్నా యూనివర్సిటీ కల నెరవేరడం లేదని అన్నారు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీగానీ, కాకతీయ యూనివర్సిటీకిగానీ విద్యార్థులు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అంతవరకు వెళ్లలేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందనారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, అయినా ఇక్కడ జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. యూనివర్సిటీ ఖమ్మం కేంద్రంగా ఇవ్వకపోతే ఇక పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పెండింగ్లో ఉన్న రూ 3,271.15 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు భాగ్యశ్రీ, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్ వెంకటేష్, సంతోష్ రెడ్డి, పావని, నవ్య తదితరులు పాల్గొన్నారు.