Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వృద్ధురాలి నిరసన
- స్పందించిన అధికారులు
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
తాను నిర్మించుకున్న ఇంకుడుగుంత, మరుగుదొడ్డి బిల్లు ఇచ్చే దాకా ఇంటికి వెళ్లనంటూ ఓ వృద్ధురాలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శనివారం బైటాయించి నిరసన తెలిపింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి చెందిన పప్పుల ఉపేంద్ర ప్రభుత్వ పథకం కింద నాలుగేండ్ల కిందట ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మించుకుంది. బిల్లు ఇప్పించాలంటూ అధికారులను పలుమార్లు వేడుకుంది. అయినా ప్రభుత్వం నుంచి బిల్లు రాకపోవడంతో విసిగి వేసారిన ఉపేంద్ర శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పడుకుని నిరసన తెలిపింది. దాంతో అధికారులు స్పందించి ఆమెకు త్వరలో బిల్లు ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.