Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే నష్టాలే : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ఎలా వస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడితే నష్టాలే తప్ప లాభాలు రావని మరోమారు తమ వైఖరేంటో స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ శ్రీలంక పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హత కోల్పోయారని విమర్శించారు. కరోనాతో ఎంతమంది చనిపోయారని నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేశారు. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ రాష్ట్రానికి ఇస్తున్నా లేనిపోని విమర్శలు చేస్తున్నదన్నారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్నందున కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు.