Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ స్థాయిలో ఉదరుపూర్ నవ సంకల్ప శివిర్ కమిటీ తరహాలో టీపీసీసీ రాష్ట్రస్థాయి నవ సంకల్ప చింతన్ శివిర్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర చైర్మెన్‌గా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కన్వీనర్‌గా ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు (ఆర్గనైజేషన్) నియమించారు. ఈమేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో 32 మంది సభ్యులను నియమించారు. జూన్ 1, 2 తేదీల్లో నవ సంకల్ప శివిర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత బండ్రు శోభారాణి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణి కాంగ్రెస్‌లో చేరారు. ఈమేరకు ఆదివారం అమెరికాలో ఇండియాన్ ఓవర్సీస్ కాంగ్రెస్, టీపీసీసీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో గూటికి చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించి, పల్లె ప్రగతి నిర్వహించండి :
సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్ లేఖ
గత పల్లె ప్రగతి పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఐదవ విడత పల్లె ప్రగతి నిర్వహించాలని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. సిబ్బంది జీతాలు, డీజిల్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.