Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలివ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం వంచించడమేనని విమర్శించారు. ఆ భూముల్లో హరితహారం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర అటవీ చట్టం ప్రకారం పోడు భూములపై గిరిజనులకు హక్కులు ఉన్నాయనిస్పష్టం చేశారు. హరితహారానికి వ్యతిరేకం కాదనీ, కేవలం పోడు భూముల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 3.5 లక్షల మంది గిరిజన రైతులు తమకు పట్టాలివ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న విషయాన్నిగుర్తు చేశారు.