Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీ నర్సింహారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలకు ఇండ్లు, ఇడ్ల స్థలాలకోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పట్నం సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పేదల సొంతింటి కల నెరవేరలేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలకు అందని ద్రాక్షలా మారిందనిని తెలిపారు. జీఓ నెం 58,59 ప్రకారం 125 గజాలలోపు ఇండ్ల స్థలాలు ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనీ, సొంత ఇంటి జాగా ఉంటే ఇండ్లు నిర్మించుకునేందుకు మూడు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయకుండా మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నదని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జూన్లో ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో కేవీఎస్ఎన్ రాజు, డీఎఎస్వీ ప్రసాద్,లోకేశ్ కుమార్,డి మల్లేశ్,మారన్న తదితరులు పాల్గొన్నారు.