Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెల్త్ రిపార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఐదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం గాంధీ ఆస్పత్రిలో హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ ఏ.ఆర్.రెడ్డి, డాక్టర్ ప్రభు కుమార్, డాక్టర్ సిద్ధిపేట రమేశ్ తదితరులు అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపును అడ్డుకోవడం, నకిలీ వైద్యులకు శిక్షణను కోర్టు ద్వారా ఆపడం తదితర విజయాలను గుర్తుచేసుకున్నారు.
భవిష్యత్తులోను హెచ్ఆర్డీఏ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్, కోశాధికారి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.